Fighter: ‘ఫైటర్‌’ ముద్దుసీన్‌ వివాదంపై స్పందించిన దర్శకుడు ?

‘ఫైటర్‌’ ముద్దుసీన్‌ వివాదంపై స్పందించిన దర్శకుడు ?

Fighter: ‘వార్’, ‘పఠాన్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్‌కపూర్‌ ప్రధాన పాత్రల్లో విడుదలైన తాజా సినిమా ‘ఫైటర్(Fighter)’. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందించిన ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. ‘ఫైటర్’ సినిమాలో హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా కనిపించగా… దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా, గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ లో ఉంటుండగా…. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన లిప్ కిస్ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు.

Fighter Movie Director Comment

‘ఫైటర్‌’లో ముద్దు సీన్‌ వివాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ పంపించిన నోటీసులపై చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ స్పందించారు. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పై నాకు గౌరవముంది. నిబంధనల మేరకే సినిమా తీశాం. స్క్రిప్ట్‌ రాసుకున్నప్పటి నుంచి సెన్సార్‌ రిపోర్ట్‌ వరకు ప్రతి విషయాన్ని వాయుసేన అధికారులతో చర్చించాం. సెన్సార్‌ పూర్తయ్యాక థియేటర్‌లో విడుదలకు ముందు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది అధికారులకు సినిమాను చూపించాం. వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ ఫిజికల్‌ కాపీ తెచ్చుకున్నాం. అసలు ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరుతో ఐఏఎఫ్‌లో ఏ అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో మాకు తెలియడం లేదు’ అన్నారు. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read : Sita Ramam Re-release : ఆ ప్రేమికుల కోసం ఈ ప్రేమ కదా చిత్రం ‘సీతారామం’ రీ రిలీజ్..

FighterHrithik Roshan
Comments (0)
Add Comment