Fatima Sana Shaikh: జిమ్ వర్కౌట్స్ తో కుర్రకారుని హీటెక్కిస్తున్న `దంగ‌ల్` బ్యూటీ !

జిమ్ వర్కౌట్స్ తో కుర్రకారుని హీటెక్కిస్తున్న `దంగ‌ల్` బ్యూటీ !

Fatima Sana Shaikh: బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని నటీమణుల్లో ఫాతిమా సనా షేక్ ఒకరు. అమీర్ ఖాన్ `దంగ‌ల్`లో నటించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఫాతిమా ఆ తరువాత అమీర్‌ తో డేటింగ్ చేస్తోంద‌న్న ప్ర‌చారం సాగింది. త‌న‌దైన అందం న‌ట‌నతో ఆక‌ట్టుకుంటూనే వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు జీవం పోయడంలో తన అసాధారణ సామర్థ్యంతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది ఫాతిమా. ఫాతిమా సినిమా అవకాశాలు, గాసిప్స్ గురించి కాసేపు ప్రక్కన పెడితే… ఇన్ స్టాలో ఈ బ్యూటీ మంచి స్పీడ్ చూపిస్తోంది. దీనికి తాజాగా ఫాతిమా జిమ్ – యోగా సెష‌న్స్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయడమే కారణంగా కనిపిస్తోంది.

Fatima Sana Shaikh….

తాజాగా ఫాతిమా(Fatima Sana Shaikh) తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఒక ఫ‌న్నీ వీడియో వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో త‌ల‌కిందులుగా శీర్షాస‌నం వేసేందుకు జిమ్ లో జంపింగ్ చేసిన‌ తీరు నోరెళ్ల‌బెట్టేలా చేసింది. దీనికి ఫాతిమ ఇచ్చిన క్యాప్ష‌న్ ఇలా ఉంది. “ఇన్‌స్టా ఛాలెంజ్ పూర్తయింది. పి.ఎస్. కిసీ కో ఇస్స్ ఛాలెంజ్ కా నామ్ సాంగ్ హై? .. నాకు మద్దతుగా నిలిచినందుకు క‌ర‌ణ్ కి ధన్యవాదాలు“ అని క్యాప్ష‌న్ లో రాసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

గతంలో ఫాతిమా మ‌రో ఫ‌న్నీ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా దూసుకెళ్లింది. అక్షయ్ కుమార్- కాదర్ ఖాన్ నటించిన ఓ చిత్రం నుండి ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఈ ఫోటోకి ఒక ఫ‌న్నీ క్యాప్షన్ ఇచ్చింది. “దుగ్గల్ సాహబ్ ఆజ్ క్యా బనే హైన్ ఊహించాలా? స్లయిడ్ 3 నిజమైన సమాధానం ఉంది!“ అని రాసింది. దీనిపై ప‌లువురు స‌హ‌న‌టీమ‌ణులు అంతే ఫ‌న్నీగా స్పందించారు. దియా మీర్జా,రియా చక్రవర్తి స‌హా ప‌లువురు ఈ పోస్ట్ పై వ్యాఖ్యానించారు.

ఇక ఫాతిమా సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిసారిగా విక్కీ కౌశల్ – సన్యా మల్హోత్రాలతో కలిసి సామ్ బహదూర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. తర్వాత నసీరుద్దీన్ షా- విజయ్ వర్మలతో ఉల్ జలూల్ ఇష్క్‌లో కనిపించనుంది. ఇటీవ‌ల ఫాతిమా ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది.

Also Read : Lakshmi Manchu: సన్ లైట్ లో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి గ్లామర్ !

Aamir KhanDangalFatima Sana Shaikh
Comments (0)
Add Comment