Faria Abdullah : డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి నో చెప్పిన జాతిరత్నాలు భామ

అయితే జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా నాగ్ అశ్విన్ వ్యవహరించిన విషయం తెలిసిందే..

Faria Abdullah : జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది ఫరియా అబ్దుల్లా(Faria Abdullah). ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా అవి అంతగా క్లిక్ అవ్వలేదు. అలాగే బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ బ్యూటీ. రీసెంట్ గా కల్కి సినిమాలో చిన్న మెరుపులా మెరిసింది. ఇటీవల అల్లరి నరేష్‌తో ` ఆ ఒక్కటి అడక్కు` లో హీరోయిన్ గా ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు.

Faria Abdullah Comment

అయితే జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా నాగ్ అశ్విన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.. అయితే ఓ కాలేజ్ ఈవెంట్ లో ఫరియాను చూసిన నాగీ ఆమెను హీరోయిన్ గా చేస్తావా అని అడిగారట. అయితే అప్పటికే పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి అప్లై చేసిందట ఈ బ్యూటీ. దాంతో ఆమె నాగ్ అశ్విన్ కు నో చెప్పిందట. అయితే ఆతర్వాత ఆమెకు పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సీట్ రాలేదు. దాంతో మరోసారి నాగ్ అశ్విన్ ను హీరోయిన్ ఛాన్స్ ఉందా అని అడిగిందట. లక్కీగా అప్పటికి ఎవరు ఫైనల్ కాకపోవడంతో ఫరియాను ఓకే చేశాడట.

Also Read : Uruku Patela : ఓ కొత్త సినిమా ‘ఉరుకు పటేల’ సినిమా నుంచి ఫస్ట్ లుక్

CommentsFaria AbdullahIndian ActressesViral
Comments (0)
Add Comment