Balakrishna : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌటేలా కలిసి నటించిన డాకూ మహారాజ్ జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. నిర్మాత నాగవంశీ బాలయ్య మూవీపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నందమూరి ఫ్యాన్స్ కు కిక్కు తెప్పించేలా చిత్రాన్ని తీశామన్నారు. ఈ మూవీకి దర్శకుడు బాబీ కొల్లి.
Hero Balakrishna Movie Updates
తనకు ఇప్పటికే హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. డాకూ మహారాజ్(Daaku Maharaaj) కు సంబంధించి బాలయ్య నట విశ్వ రూపం చూపించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. డైలాగ్ కింగ్ మేకర్ గా ఉన్న నటసింహం మరోసారి తనదైన మార్క్ తో చెలరేగాడని చెప్పవచ్చు.
హాస్యం కంటే రౌద్రాన్ని పండించడంలో , ప్రేక్షకులను మెప్పించడంలో బాలయ్య తనకు తనే సాటి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
బాలయ్య, ఊర్వశి రౌటేలా కలిసి చేసిన సాంగ్ రచ్చ రచ్చ చేస్తోంది. కొందరు మరీ అభ్యంతరకరంగా ఉందంటే ఇంకొందరు మాత్రం సినిమాకు కావాల్సిన మాస్ మసాలా ఇలా ఉంటేనే బావుంటందని అంటున్నారు. మొత్తంగా డాకూ మహారాజ్ బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు నిర్మాత.
Also Read : Hero Ram Charan-Game Changer : గేమ్ ఛేంజర్ మూవీకి శేషన్ ఇన్సిపిరేషన్