Fahadh Faasil great Actor: ఓటీటీలోకి పుష్ఫ విల‌న్‌ బ్లాక్ బస్టర్ సినిమా ’ఆవేశం‘ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలోకి పుష్ఫ విల‌న్‌ బ్లాక్ బస్టర్ సినిమా ’ఆవేశం‘ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Fahadh Faasil:పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ మళయాల నటుడుఫ‌హాద్ ఫాజిల్(Fahadh Faasil)’. ఆ తరువాత కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. అయితే పుష్ఫ సినిమాలో విలన్ గా నటించినప్పటికీ… ఫ‌హాద్ ఫాజిల్ మళయాలంలో మాత్రం హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవ‌ల ఫ‌హాద్ ఫాజిల్ నటించిన ‘అవేశం’ సినిమా… ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై కేర‌ళ‌లో రికార్డుల సృష్టించింది. రూ. 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. ఈ ఏడాది ప్రేమ‌లు, మంజ‌మ్మల్‌ బాయ్స్‌, ది గోట్ లైఫ్‌ సినిమాల త‌ర్వాత రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతేగాక ఫ‌హ‌ద్ కేరీర్‌ లోనే ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి చిత్రంగా అవేశం చ‌రిత్ర సృష్టించింది.

Fahadh Faasil:

వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అవేశం’ సినిమా… ఇప్పుడు ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది. ఈ సినిమా మే 9 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ‌ల‌యాలంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌ కు తీసుకు వ‌స్తున్నారు. గ‌తంలో రోమాంచం వంటి సూప‌ర్ హిట్ సినిమాలను అందించిన జీతూ మాధ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ స్వ‌యంగా సుమారు రూ. 20 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌గా వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టడం విశేషం.

గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌కు కామెడీని, మ‌ద‌ర్ సెంటిమెంట్‌ ను జోడిస్తూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను వీప‌రీతంగా అల‌రించింది. బీటెక్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చిన ఓ ముగ్గురు మిత్రుల‌ను సీనియ‌ర్లు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. దీనిని భ‌రించ‌లేని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్ (ఫ‌హాద్ ఫాజిల్‌) ను క‌లిసి అత‌ని సాయంతో సీనియ‌ర్ల‌పై తిర‌గ‌బ‌డ‌తారు. ఆ త‌ర్వాత నుంచి ఆ గ్యాంగ్‌ స్ట‌ర్‌ తో క‌లిసిపోతారు. చివ‌ర‌కు ఈ ముగ్గురు మిత్రులు గ్యాంగ్‌ స్ట‌ర్‌ ను చంపేందుకు ఎందుకు ఫ్లాన్ చేశార‌నే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో సాగుతూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది.

Also Read:-

Siddarth Roy bold movie:ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’ !

Aaveshamamazon primeFahadh Faasilpuspha
Comments (0)
Add Comment