KCR Shocking Comment :చ‌రిత్ర ప్ర‌స‌వంచిన బిడ్డ బీఆర్ఎస్ 

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కామెంట్స్ 

KCR : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కోసం పోరాడింది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.  ఉద్య‌మ కాలంలో భాగ‌స్వామ్యం కాని వాళ్లు, చ‌రిత్రను ప్రేమించ‌ని వాళ్లు మాత్ర‌మే చుల‌క‌న చేసి మాట్లాడార‌ని, వారి గురించి ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. యావ‌త్ దేశం గ‌ర్వ‌ప‌డేలా పార్టీని నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. ఏ పార్టీకి లేని వ్య‌వ‌స్థ మ‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు కేసీఆర్.

Ex CM KCR Shocking Comments

తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ అన్నారు. రాజ‌కీయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని దానిని బీఆర్ఎస్ గా మార్చ‌డం జ‌రిగింద‌న్నారు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం ఇప్ప‌టికీ మ‌న వైపు ఉన్నార‌నే సంగ‌తిని మ‌రిచి పోకూడ‌ద‌న్నారు కేసీఆర్.

మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారికి 53 సీట్లు రిజ‌ర్వ్ చేస్తామ‌న్నారు.  బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ గా చ‌రిత్ర సృష్టించిందన్నారు.

తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాల నుండి కోలుకున్న తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా, ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులకు అధినేత దిశానిర్దేశం చేశారు.

Also Read : ఛావా చిత్రం ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌ర‌థం

CommentskcrViral
Comments (0)
Add Comment