Emergency Movie : కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాంబే హైకోర్టు

ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులివ్వడంతో కంగనార్ సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది...

Emergency : బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించి, స్వయంగా నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ. అయితే ఆరంభం నుంచే ఎన్నో వివాదాలు ఎదుర్కొంటోన్న ఈ సినిమా విడుదల కోసం కంగనా తీవ్రంగా శ్రమిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ(Emergency) సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే ఆమె బీజేపీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా మూవీ విడుదల ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు విడుదల సమయం రాగానే కంగనార్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ నిరాకరించింది. దీనిని ప్రశ్నిస్తూ కంగనా కోర్టును ఆశ్రయించింది.

ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులివ్వడంతో కంగనా సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో సీబీఎఫ్‌సీ జాప్యం చేస్తోందని, సీబీఎఫ్‌సీకి కోర్టు నోటీసులు జారీ చేయాలని నటి కంగనా రనౌత్ కోర్టును ఆశ్రయించారు. ‘ రెండు వారాల క్రితం విచారించిన బాంబే హైకోర్టు ఇదే అంశంపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు, సీబీఎఫ్‌సీకి నోటీసులు జారీ చేసింది కాబట్టి ఈ దశలో మేము (బాంబే హైకోర్టు) సీబీఎఫ్‌సీకి నోటీసు జారీ చేయలేం’ అని కోర్టు ఇదివరకు చెప్పుకొచ్చింది. కానీ తాజా విచారణలో ‘ఎమర్జెన్సీ(Emergency)’ సినిమాకు సంబంధించి బాంబే హైకోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులు జారీ చేసింది. వారంలోగా అంటే సెప్టెంబర్ 25లోగా సినిమా సర్టిఫికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్‌సీకి సూచించింది.

Emergency Movie Updates

అలాగే, ‘లా అండ్ ఆర్డర్ సమస్య గురించి ఆందోళన ఉన్నందున సృజనాత్మక స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛను హరించలేం. లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించదు’ అని పేర్కొంది. ‘ ఎమర్జెన్సీ’ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారని, రాజకీయ దురుద్దేశంతో సినిమా తీశారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాత్రలను ఉద్దేశ్యపూర్వకంగా ట్విస్ట్ చేసి ‘విలన్’లుగా చూపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు, సిక్కు సంఘం ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ సినిమాలో పంజాబీలను తక్కువ చేసి చూపించారని ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే కొన్ని చోట్ల కంగనా సినిమాపై నిరసనలు వెల్లువెత్తాయి.

Also Read : Manchu Manoj : జానీ మాస్టర్ పై హీరో మంచు మనోజ్ ట్వీట్

CinemaemergencyKangana RanautUpdatesViral
Comments (0)
Add Comment