Ek Dum Ek Dum Song : ఏక్ ద‌మ్ ఏక్ ద‌మ్ ధ‌నా ధ‌న్

ర‌వితేజ నుపుర్ స‌న‌న్ సూప‌ర్

Ek Dum Ek Dum Song : వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాకు సంబంధించి విడుద‌లైన ఏక్ ఏక్ ద‌మ్ సాంగ్(Ek Dum Ek Dum Song) దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. మాస్ మ‌హ‌రాజా ర‌వి తేజ , నుపుర్ స‌న‌న్ ఇందులో న‌టించారు. యూత్ కు కిర్రాక్ తెప్పించేలా సాంగ్ ఉంది.

Ek Dum Ek Dum Song Trending

జీవి ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందించ‌గా భాస్క‌రబ‌ట్ల ర‌వి కుమార్ ఏక్ ఏక్ ద‌మ్ పాట‌ను రాశారు. వ్యూయ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సాంగ్ ను సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. ఎల‌క్ట్రిఫైయింగ్ ఫ‌స్ట్ సింగిల్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.

వంశీ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎప్ప‌టి లాగే అనురాగ్ కుల‌క‌ర్ణి హుషారు తెప్పించేలా పాడాడు. జూబ్లీ 10 స్టూడియోలో ఈ సాంగ్ ను రికార్డింగ్ చేశారు. ర‌వితేజ, గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్ , నుపుర్ స‌న‌న్ తో పాటు ప్ర‌ముఖ న‌టి , ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తోంది.

వీరితో పాటు అనుప‌మ్ ఖేర్ , నాస‌ర్ , ముర‌ళీ శ‌ర్మ‌, జిషు సేన్ గుప్తా, సుదేవ్ నాయ‌క‌ర్ , హ‌రీష్ స్ప‌ర‌ది న‌టించారు. అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు.

Also Read : Jawan Movie Review : ఖాన్ జ‌వాన్ తుఫాన్

Comments (0)
Add Comment