ED Case : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రత్యేకించి మాజీ సీనియర్ పోలీస్ ఆఫీసర్, ప్రస్తుత టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రజల్లో ముఖ్యంగా యూత్ లో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు యూట్యూబర్లు. వీరిలో చాలా ఇన్ ఫ్లూయర్స్ కూడా ఉండడం విశేషం.
ED Case Against Youtubers
ఈ మొత్తం వ్యవహారంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వచ్చిన వారి వివరాలు సేకరించారు. ఆపై మొత్తం 11 మంది యూట్యూబర్లు ఉన్నారని గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. దీంతో నిన్నటి దాకా సోషల్ మీడియాలో తళుక్కున మెరిసిన యూట్యూబర్లంతా ఇప్పుడు బెంబేలెత్తి పోతున్నారు.
ఇదే సమయంలో యూట్యూబర్లకు మరో షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ED) ఎంటర్ అయ్యింది. కేసుకు సంబంధించిన వివరాలు సేకరించింది. ఎంత మేరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తూ సంపాదించారనే దానిపై ఆరా తీసింది. అంతే కాకుండా ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా దర్యాప్తు చేస్తోంది.
Also Read : Surekha Vani Daughter Shocking :తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా