Eagle Movie : ఈసారి తెలుగు వారికి అసలైన పండగ సంక్రాంతి రాబోతోంది. పలు సినిమాలు ఆరోజే రానున్నాయి. దీంతో ఎవరి సినిమాలు ఆడతాయనేది ఉత్కంఠ నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన మహేష్ బాబు, శ్రీలీల , మీనాక్షి చౌదరి నటించిన గుంటూరు కారం చిత్రం కూడా సంక్రాంతికి ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. మరో వైపు మాస్ మహరాజా రవితేజ నటించిన ఈగిల్ కూడా రాబోతోంది.
Eagle Movie Updates
ఈ చిత్రానికి ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వం వహించారు. యాక్షన్ , థ్రిల్లర్ కథాంశంతో తీశాడు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్ , నవదీప్ , శ్రీనివాస్ అవసరాల, మధు, కావ్య థాపర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ పై విశ్వ ప్రసాద్ ఈగిల్ ను నిర్మించారు.
రహస్య ఏజెంట్ పాత్రలో రవితేజ(Ravi Teja) నటిస్తుండడం విశేషం. ఇదంతా డిఫరెంట్ గా తీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇప్పటి వరకు తను నటించిన సినిమాలలో కంటే ఈ ఈగిల్ చిత్రం భిన్నంగా ఉంటుందని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. మొత్తంగా ఈగిల్ కూడా పండగ రోజే రావడంతో ఎవరి సినిమాలు ఎలా ఆడతాయో చూడాలి.
Also Read : Amitabh Bhachchan : బన్నీ డ్యాన్స్ కు బిగ్ బి ఫిదా