Hero Pawan Kalyan :స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యం

ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఎలాంటి రాజ‌కీయం లేద‌న్న ప‌వ‌న్ 

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ముఖ పుణ్య క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తున్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో డిప్యూటీ సీఎంకు గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Pawan Kalyan Comments

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు కుమారుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు  ఆనంద్ సాయి ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంత‌కు ముందు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) మీడియాతో మాట్లాడారు. తాను భార‌తీయ జ‌న‌తా పార్టీ కోసం ప్ర‌చారం చేసేందుకు రాలేద‌న్నారు. కొంద‌రు చేస్తున్న ప్ర‌చారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ అవ‌స‌రం త‌న‌కు లేద‌న్నారు. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల కంటే ముందు తాను మొక్కుకున్నాన‌ని, అందుకే ఇప్పుడు పుణ్య క్షేత్రాల‌ను ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకుంటాన‌ని చెప్పారు.

స‌న‌తాన ధ‌ర్మం కోసం ఎంత వ‌ర‌కైనా వెళ‌తాన‌ని, అవ‌స‌ర‌మైతే పోరాడుతాన‌ని, వీలైతే ప్రాణాలు కోల్పోయేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. తిరుమ‌ల‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ప‌ట్ల ఆవేద‌న చెందారు. ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త పాల‌క మండ‌లిపై ఉంద‌న్నారు.

Also Read : Prudhvi Shocking :న‌న్ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారు

AP Deputy CM Pawan KalyanCommentspawan kalyanTrending
Comments (0)
Add Comment