Dunki Movie : కింగ్ ఖాన్ షారూక్ రూటు మార్చాడు. పఠాన్, జవాన్ వంటి వరుస యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన కింగ్ ఖాన్ ఇప్పుడు వాటికి భిన్నంగా డంకీ(Dunki) సినిమాతో కొత్త లుక్ లో వస్తున్నాడు. ఫైట్స్, మాస్ కు దూరంగా కామెడీ, ప్రేమ, భావోద్వేగాల కలబోతతో పూర్తి రాజ్ కుమార్ హిరాణి మార్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది సస్పెన్స్ గా మారింది. ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి…ఈ సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీతో మాస్ అండ్ యాక్షన్ సినిమా రికార్డులను బద్దలుగొడతాడా అనేది వేచిచూడాలి.
Dunki Movie – డంకీ మూవీ లైన్
డంకీ డ్రాప్-1 పేరిట చిత్ర యూనిట్ రిజీల్ చేసిన వీడియోకు మంచి స్పందన వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ తిరిగే ఈ డంకీను రాజ్ కుమార్ హిరాణి తనదైన మార్క్ హాస్యం, భావోద్వాగాలు, స్నేహం, ప్రేమను మిళితం చేసి తెరకెక్కిస్తున్నారు. యధార్ధ ఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కింగ్ ఖాన్ కు యాట్రిక్ విజయాన్ని అందించి మాస్ మాత్రమే కాదు క్లాస్ తోనూ కింగ్ ఖాన్ కు తిరుగులేదు అని నిరూపిస్తుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Also Read : Japan Movie : సొసైటీపై జపాన్ సెటైర్