Drashti Dhami: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి !

తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి !

Drashti Dhami: బాలీవుడ్‌ భామ, బుల్లితెర నటి ద్రష్టి ధామి తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్‌ నటులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది.

Drashti Dhami….

ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను వివాహం చేసుకున్నారు. కెరీర్ విషయానికొస్తే డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో కూడా ఆమె పాల్గొన్నారు. ధామి 2007లో టీవీ సీరియల్‌ దిల్ మిల్ గయేతో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2010లో గుర్మీత్ చౌదరి సరసన గీత్ – హుయ్ సబ్సే పరాయి సీరియల్‌లోనూ కనిపించింది. ఆమెకు మధుబాల, ఏక్ ఇష్క్ ఏక్ జునూన్‌ సీరియల్‌తనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె వివియన్ దేనాకు జంటగా నటించింది. అంతే కాకుండా ఇటీవలే ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ప్రస్తుతం పెళ్లయిన దాదాపు తొమ్మిదేళ్లకు ద్రష్టి ధామి తల్లి కాబోతోంది.

Also Read : Divya Spandana: మర్డర్ కేసు నిందితుడు దర్శన్ పై కన్నడ నటి రమ్య ఆగ్రహం !

BollywoodDrashti Dhami
Comments (0)
Add Comment