Dragon : తెలుగు భాషలలో ఇటీవలే విడుదలై ఎవరూ ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అందుకుంది మారి ముత్తు దర్శకత్వం వహించిన డ్రాగన్(Dragon). లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కలిసి నటించారు. కథా పరంగా కుర్రకారును మెస్మరైజ్ చేసింది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం రొమాంటిక్, వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇది తక్కువ కాలంలోనే రూ. 100 కోట్ల మైలు రాయిని దాటేసింది.
Dragon Movie OTT Updates
ఇక డ్రాగన్ ను చేజిక్కించుకునేందుకు వరల్డ్ వైడ్ గా పేరు పొందిన ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధరకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ చేజిక్కించుకుంది. దీంతో థియేటర్లకు వెళ్లలేని అభిమానులంతా డ్రాగన్ ను ఓటీటీలో చూసేందుకు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే మూవీ దుమ్ము రేపడంతో మార్చి 28న నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం.
డ్రాగన్ తో పాటు అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ కలిసి నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విదాముయార్చి , థగ్ లైఫ్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన పేరులేని ప్రాజెక్టు కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక డ్రాగన్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Singer Kalpana Shocking :ఒత్తిడి తట్టుకోలేకే టాబ్లెట్స్ వేసుకున్నా