Dragon Sensational Collections :డ్రాగ‌న్ వ‌సూళ్ల‌లో సెన్సేష‌న్

రూ. 50 కోట్ల మార్క్ దాటవేత‌

Dragon : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, క‌యాదు లోఫ‌ర్ క‌లిసి న‌టించిన చిత్రం డ్రాగ‌న్ దుమ్ము రేపుతోంది. వ‌సూళ్ల‌లో రికార్డ్ బ‌ద్ద‌లు కొడుతోంది. అంచ‌నాల‌కు మించి ఆశించిన దానికంటే స‌క్సెస్ అందుకోవ‌డంతో చిత్ర బృందం చిట్ చాట్ లో మునిగి పోయింది.

Dragon Movie Collections

ఇప్ప‌టికే ల‌వ్ టుడే ద్వారా పాపుల‌ర్ అయిన న‌టుడు , ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ నేష‌న‌ల్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. స్టార్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. ఇప్పుడు కుర్ర‌కారంతా బుజ్జి క‌న్నా అంటూ ప్రేమ‌గా పిలుస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన డ్రాగ‌న్(Dragon) మూవీ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. రికార్డుల మోత మోగిస్తోంది. స్టార్ హీరోల‌కు ధీటుగా ఈ చిత్రం నిలిచింది. ఏకంగా త‌క్కువ రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది.

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన అన్ని చిత్రాల‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది డ్రాగ‌న్. తొలి చిత్రంగా అజిత్ న‌టించిన విదాముయార్చి రూ. 81.5 కోట్లు సాధించ‌గా రెండో స్థానంలో డ్రాగ‌న్ నిలిచింది. ఇక విశాల్ రెడ్డి, అంజ‌లి, వ‌రల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ క‌లిసి న‌టించిన మ‌ద‌గ‌జ‌రాజా చిత్రం రూ. 48.7 కోట్ల‌తో మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది.

ఇక వ‌సూళ్ల ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 6.5 కోట్లు వ‌సూలు చేయ‌గా, 2వ రోజు రూ. 10.8 కోట్లు, 3వ రోజు రూ. 12.75 కోట్లు, 4వ రోజు రూ. 5.8 కోట్లు, 5వ రోజు రూ. 5.1 కోట్లు, 6వ రోజు రూ. 5.2 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తం ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 50.15 కోట్లు సాధించింది.

Also Read : Chhaava Movie Sensational :రూ. 600 కోట్ల క్ల‌బ్ లోకి ఛావా

CinemaCollectionsDragonTrendingUpdates
Comments (0)
Add Comment