Kayadu Lohar : సినిమా తన పేషన్ . అస్సాం ప్రాంతానికి చెందిన కయాదు లోహర్(Kayadu Lohar) ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారి పోయింది. గతంలో కొన్ని సినిమాలలో నటించినా అంతగా వర్కవుట్ కాలేదు. పేరు కూడా రాలేదు. తనను ఎవరూ గుర్తు పట్టలేదు కూడా. కానీ తాజాగా ప్రదీప్ రంగనాథన్ తో కలిసి పల్లవి పాత్రలో నటించింది కయాదు లోహర్.
Kayadu Lohar Got Chances
ఇంకేం కుర్రకారును మెస్మరైజ్ చేసేసింది. అంతే కాదు అందంతో పాటు అభినయం కూడా తోడవడంతో ఉన్నట్టుండి అందరి దృష్టిని ఆకర్షించింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడంతో నిర్మాతలు, దర్శకులు ఈ ముద్దుగుమ్మపై ఫోకస్ పెట్టారు.
డ్రాగన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో తీశారు. దీనిని తమిళం, తెలుగులో రిలీజ్ చేశారు. ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను సాధించింది. సినీ ట్రేడ్ వర్గాలను విస్మయ పరుస్తూ ఏకంగా రూ. 100 కోట్ల మైలు రాయిని దాటేసింది. ఇక సినిమాకు సంబంధించిన సంగీతం, పిక్చరైజేషన్ వీర లెవల్లో తీశాడు దర్శకుడు మారి ముత్తు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది కాయదు లోహర్. అయితే తను 2021లో కన్నడ చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగులో అల్లూరిలో నటించింది. కానీ అంతగా ఆడలేదు. తాజాగా ఒకేసారి స్టార్ డమ్ రావడంతో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించే ఫంకీస్ లో నటించనుంది. ఇక మలయాళం స్టార్ హీరో నివిన్ పౌలితో తారం అనే మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని టాక్. మొత్తంగా డ్రాగన్ ఈ అమ్మడి జీవితాన్నే మార్చేసింది. అదృష్టం అంటే ఇదే కదూ.
Also Read : Kannada Super Star-RC16 : చెర్రీ..జాన్వీతో జత కట్టిన సూపర్ స్టార్