Hero Chiranjeevi-KA Paul : అన్న‌ద‌మ్ములు ప్యాకేజీ స్టార్లు

నిప్పులు చెరిగిన డాక్ట‌ర్ కేఏ పాల్

KA Paul : మెగా ఫ్యామిలీపై విరుచుకు ప‌డ్డారు ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్(KA Paul). మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఇద్ద‌రూ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తులంటూ హెచ్చ‌రించారు. ఇద్ద‌రూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేశారంటూ ఆవేద‌న చెందారు. చిరంజీవి ఆనాడు ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీలో క‌లిపి వేశార‌ని, త‌ను కేంద్రంలో ప‌ద‌వి తీసుకుని మౌనంగా ఉన్నార‌ని అన్నారు. ఏనాడూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు.

KA Paul Slams…

ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌ను కేవ‌లం కాసుల కోసమే తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదంటూ నిల‌దీశారు.

ఇద్ద‌రూ సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ అన్న‌ద‌మ్ములకు రాజ‌కీయ విలువ‌లంటూ ఏవీ లేవ‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలుత చేగువేరా త‌నకు ఆద‌ర్శం అన్నారని, ఇప్పుడు స‌నాత‌న ధ‌ర్మం అంటూ ముందుకు వెళుతున్నార‌ని, తాను ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌ద‌న్నారు.

Also Read : Beauty Mamatha Kulkarni : స‌న్యాసినిగా మారిన న‌టీమ‌ణి

ChiranjeeviCommentsKA Paulpawan kalyanSlamsViral
Comments (0)
Add Comment