Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. బిగ్ బుల్ పాత్రలో విలన్ గా నటిస్తుండగా… రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… ఆగస్టు 15న విడుదల కు సిద్ధంగా ఉంది.
Double Ismart…
ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్‘ ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా గెటప్ శ్రీనుతో రామ్ పోతినేని, కావ్య థాపర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆటోలో వచ్చిన గెటప్ శ్రీను… హీరోయిన్, హీరోతో కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ట్విటర్‌లో పంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్- డబుల్ డోస్ రైడ్ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : Samantha-Citadel : సమంత సిటాడెల్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్