Double Ismart: ‘పుష్ప 2’ తో పోటీకు సై అంటున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ !

‘పుష్ప 2’ తో పోటీకు సై అంటున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ !

Double Ismart: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనితో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. దీనితో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్ కోసం అభిమాననులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Double Ismart Updates

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌(Double Ismart)’ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హీరో రామ్ పోతినేని కు సంబంధించిన ఓ ఇంటెన్స్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను ఆగస్ట్‌ 15న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘ఆగస్ట్‌ 15 గురువారం సెలవు. అలాగే సోమవారం రక్షాబంధన్‌. మధ్యలో శని, ఆదివారాల వీకెండ్‌ కలిసొస్తుంది అనేది చిత్ర యూనిట్ భావన. ఈ నేపథ్యంలో మా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదలకు ఆగస్ట్‌ 15 పర్ఫెక్ట్‌ డేట్‌’’ అని చిత్రబృందం పేర్కొని, రామ్‌ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

అయితే అదే రోజున మరో పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’ విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. దీనికోసం 200 డేస్ టూ గో అంటూ ఓ కౌంట్ డౌన్ పోస్టర్ ను కూడా గతంలో విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’కు పోటీగా ‘డబుల్ ఇస్మార్ట్’ ను విడుదల చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15, రక్షాబంధన్ తో పాటు వీక్ ఎండ్ కలిసి రావడంతో రెండు భారీ సినిమాల విడుదలకు స్కోప్ ఉన్నప్పటికీ… రెండు టాలీవుడ్ కు చెందిన భారీ ప్రాజెక్టులు కావడం విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ‘పుష్ప 2’ వాయిదా పడనున్నట్లు ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి ఈ సినిమాను ఫిక్స్ చేసారనే వాదన కూడా వినిపిస్తోంది.

Also Read : Usha Rani: సైబర్ నేరగాళ్ళ వల నుండి తృటిలో తప్పించిన ‘కార్తీక దీపం’ నటి !

allu arjunDouble IsmartPuspha 2Ram Pothineni
Comments (0)
Add Comment