Double ISmart: ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్(Double ISmart)’. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. బిగ్ బుల్ పాత్రలో విలన్ గా నటించగా… రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. రామ్ సరసన కావ్య థాపర్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో సంజయ్ దత్, సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
Double ISmart – ‘డబుల్ ఇస్మార్ట్’ కథేమిటంటే ?
బిగ్ బుల్ (సంజయ్‌దత్) విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనేది అతని కల. అతని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ వేట కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో బిగ్‌బుల్ మెదడులో కణితి ఉందని, దాని ప్రభావంతో కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు. మరో వందేళ్ల ప్రణాళికలతో బతుకుతున్న బిగ్ బుల్ తాను చనిపోకూడదని, ఎలాగైనా బతకాలనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది.
మరోవైపు ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్‌లో పేస్ట్ చేస్తారు. దాంతో శరీరం ఇస్మార్ట్ శంకర్ ది అయినా, ఆలోచనలన్నీ బిగ్ బుల్‌వే కాబట్టి అతనికి మరణం ఉండదనేది వాళ్ల ప్లాన్. ఇంతలో ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్‌గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు ? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు ?మరి ఇస్మార్ట్ శంకర్‌లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది ? ఇస్మార్ట్ ఎలాంటి లక్ష్యంతో ఉంటాడు ? అతని సొంత జ్ఞాపకాలు, అతని ప్రేమ, లక్ష్యాలు ఏమయ్యాయి? అన్నది చిత్ర కథ.
Also Read : Devara: ఆకట్టుకుంటోన్న ఎన్టీఆర్ ‘దేవర’ థర్డ్ సింగిల్ !