Double iSmart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పై కీలక అప్‌ డేట్‌ ఇవ్వడానికి సిద్ధమౌతోన్న సినిమా యూనిట్ !

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పై కీలక అప్‌ డేట్‌ ఇవ్వడానికి సిద్ధమౌతోన్న సినిమా యూనిట్ !

Double iSmart: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Double iSmart Movie Updates

దీనితో ‘డబుల్‌ ఇస్మార్ట్(Double iSmart)’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఆదివారం ఉదయం 10.03 గంటలకు ఆసక్తికర విషయాన్ని పంచుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ‘ఈసారి ఇస్మార్ట్‌ మ్యాడ్‌ నెస్‌ డబుల్‌ ఇంపాక్ట్‌ తో రానుంది’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

మెమొరీని ట్రాన్స్‌ ఫర్‌ చేస్తూ మనిషి మెదడుకి చిప్‌ పెట్టడమన్న కాన్సెప్ట్‌ తో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ యువతను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్‌ నటన, డైలాగ్‌ డెలివరీ అలరించాయి. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌ లో రెండు చిప్‌లు పెడతారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ పాత్రకే రెండు చిప్‌ లు ఉంటాయని తెలుస్తోంది. రెండో చిప్‌ యాక్టివేట్‌ అయినప్పుడు తెరపై రామ్‌ సృష్టించే విధ్వంసం ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని టాక్‌. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న గెటప్ శ్రీను ఇచ్చిన హింట్ కూడా వైరల్‌గా మారింది. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తొలి భాగంలో నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ నటించగా, ఇందులో ఇప్పటివరకూ హీరోయిన్‌ను పరిచయం చేయలేదు. మరి కథానాయికగా ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి మొదలైంది.

Also Read : Hero Ravi Teja : ఇచ్చిన మాటకు బిగ్ బాస్ అమర్ కి తన సినిమాలో స్థానమిచ్చిన రవితేజ

Double Ismartpuri jagannadhRam Pothineni
Comments (0)
Add Comment