Donald Sutherland: హాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి ! సంతాపం తెలిపిన సమంత, కరీనా !

హాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి ! సంతాపం తెలిపిన సమంత, కరీనా !

Donald Sutherland: హాలీవుడ్ ప్రముఖ నటుడు డొనాల్డ్ సదర్లాండ్ (88) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మయామిలో 20 జూన్ 2024న మృతిచెందారు. హాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డొనాల్డ్ సదర్లాండ్ ఎన్నో చిత్రాలలో నటించారు. దాదాపు 60 ఏళ్ల పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమకు సేవలందించిన డొనాల్డ్ మృతి‌కి హాలీవుడ్ నటులతో పాటు… భారతదేశానికి చెందిన నటీనటులు కూడా సంతాపం ప్రకటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్, సౌత్ హీరోయిన్ సమంత కూడా ఉన్నారు.

Donald Sutherland No More

తాజాగా కరీనా కపూర్, సమంతలు తమ ఇన్‌స్టా స్టేటస్‌ లో డొనాల్డ్ సదర్లాండ్(Donald Sutherland) మృతికి సంతాపం ప్రకటించారు. డొనాల్డ్ సదర్లాండ్ మృతి వార్త తెలిసి తన హృదయం బద్దలైందనేలా రియాక్ట్ అవగా… ఎప్పటికీ ప్రేమతో అంటూ కరీనా కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. డొనాల్డ్ సదర్లాండ్ విషయానికి వస్తే… 17 జూలై 1935న సెయింట్ జాన్, న్యూ బ్రున్స్‌విక్‌లోని సెయింట్ జాన్ జనరల్ హాస్పిటల్‌లో జన్మించారు. పూర్తి పేరు డోనాల్డ్ మెక్‌నికోల్ సదర్లాండ్. కెనడా యొక్క అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరిగా ఆయన పేరు గడించారు. ‘ది డర్టీ డజన్, M*A*S*H, మరియు కెల్లీస్ హీరోస్’ వంటి చిత్రాలు డొనాల్డ్ సదర్లాండ్‌ నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాగే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన నటనకు వరించాయి. డొనాల్డ్ సదర్లాండ్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులతో పాటు కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ సంతాపం ప్రకటించారు.

Also Read : Choreographer Bosco Martis: ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఎగ్జయిట్ అయిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ !

Donald SutherlandKareena KapoorSamantha Ruth Prabhu
Comments (0)
Add Comment