Dolly Sohi : బాలీవుడ్ లో మరో విషాదం…ప్రముఖ టీవీ నటి ‘డాలీ సోహి’ మృతి

ప్రయాణం ఎంత కష్టమైనా పోరాడే శక్తి ఉంటే సులభమవుతుంది..

Dolly Sohi : టీవీ నటి డాలీ సోహీ కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె సోదరి అమన్‌దీప్ కామెర్లు చికిత్స పొందుతూ మరణించిన కొన్ని గంటల తర్వాత, డాలీ కూడా మరణించింది, ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. డాలీ, అమన్‌దీప్‌లు ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి అమన్‌దీప్‌ మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున డాలీ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించింది డాలీ(Dolly Sohi).. తాజాగా తను కీమోథెరపీ చేయించుకున్న ఫోటోను గత సంవత్సరం పోస్ట్ చేసింది.

Dolly Sohi No More

“ప్రయాణం ఎంత కష్టమైనా పోరాడే శక్తి ఉంటే సులభమవుతుంది.. కాన్సర్ వచ్చినందుకు బాధపడాలా? లేకుంటే ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఉదాహరణగా నిలవడం మన చేతుల్లోనే ఉంది. ” అంటూ అందరికి మనోథైర్యం నింపేలా పోస్ట్ చేసారు. హిందీలో “రానక్” మరియు “మేరీ ఆషికీ తుమ్సే హై” వంటి సీరియల్లతో డాలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇటీవల ఆమె మృతితో హిందీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Also Read : Kerala Govt : దేశంలోనే మొదటిసారి ఓటీటీ బిజినెస్ మొదలు పెట్టిన కేరళ గవర్నమెంట్

ActressBollywoodBreakingDeathsUpdatesViralWeb Series
Comments (0)
Add Comment