Breast Cancer: ప్రస్తుతం చాలా మంది మూఢనమ్మకాల మాయలోనే ఉంటున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా మూఢనమ్మకాలను వదలడం లేదు. పది మంది ఏది నిజం నమ్మితే పదకొండో వాడు కూడా అదే నిజం అనే నమ్ముతున్నారు. కంప్యూటర్ కాలంలో కూడా కలర్స్ పై అపోహలు పెట్టుకుంటున్నారు.
Breast Cancer :
అసలు విషయంలోకి వెళ్లితే.. కొంత మంది నల్లరంగు బ్రా ధరించడం వలన అనారోగ్యసమస్యలు వస్తాయని, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్(breas cancer )వస్తుందని చెబుతుంటారు. దీంతో కొంత మంది మహిళలు నల్ల రంగు బ్రా కొనుగోలు చేయడానికి భయపడుతుంటారు.
ఎందుకంటే బ్లాక్ కలర్ బ్రా వేడిని గ్రహిస్తుంది. తద్వారా రొమ్ము వేడిని బ్లాక్ బ్రా గ్రహించి తద్వారా అది క్యాన్సర్‌కు దారితీస్తుందని చెబుతుంటారు. అయితే ఈ విషయాన్ని కొందరు ఇదో మూఢనమ్మకం అని కొట్టిపారేస్తే, మరికొందరు ఇది నిజమే అని నమ్ముతున్నారు. కానీ దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు.
Also Read : Showering : స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం మంచిదేనా?