DJ Tillu: సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకునే అతి తక్కువ మంది దర్శక నిర్మాతల్లో బొమ్మరిల్లు భాస్కర్, దిల్ రాజు ఒకరు. బొమ్మరిల్లు సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ గా గుర్తింపు పొందారు దర్శకుడు భాస్కర్ నటరాజన్. దిల్ సినిమాతో దిల్ రాజుగా గుర్తింపు పొందారు నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకటరమణా రెడ్డి. వీరిబాటలోనే డిజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఫేమస్ అయ్యారు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ.
DJ Tillu New Movie
అయితే తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘ఎస్‌వీసీసీ 37’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధూతో దర్శక నిర్మాతలు కలసి ఉన్న పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆధ్యంతం వినోదం పంచే చిత్రమిదని తెలుపుతూ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Also Read : Dil Raju: సింగర్ అవతారం ఎత్తిన నిర్మాత దిల్ రాజు