Divyanka Tripathi: బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. గురువారం ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు.
Divyanka Tripathi Met With an Accident
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు దివ్యాంక త్రిపాఠి కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఆమె భర్త వివేక్ నటికి సంబంధించిన ఎక్స్ రేను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు రెండు ఎముకలు విరిగినట్లు సమాచారం. ఇవాళ శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే గాయం నుంచి కోలుకుంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకుంది. దివ్యాంక త్రిపాఠి తన కెరీర్‌లో పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలలో పాల్గొంది.
Also Read : Mammootty: మమ్ముట్టితో విభేదాలపై స్పందించిన దర్శకుడు లింగుస్వామి !