Divya Spandana: మర్డర్ కేసు నిందితుడు దర్శన్ పై కన్నడ నటి రమ్య ఆగ్రహం !

మర్డర్ కేసు నిందితుడు దర్శన్ పై కన్నడ నటి రమ్య ఆగ్రహం !

Divya Spandana: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. సినిమాలో మంచి పాత్రలు చేసే ఆయన నిజ జీవితంలో విలన్‌ గా మారాడు. తన ప్రేయసి పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న నెపంతో తన అభిమాని, ఫార్మా ఉద్యోగి రేణుకా స్వామిని దారుణంగా చంపించాడు. చిత్రదుర్గ్‌ దర్శన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ కన్వీనర్‌ రాఘవేంద్ర (రఘు)తో కలిసి బెల్ట్‌, కర్రలతో బాది, గోడకేసి కొట్టి చంపి, తర్వాత బాడీని మురికి కాలువలో పడేశారని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దర్శన్, పవిత్ర సహా మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Divya Spandana Comments

అయితే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ పై… ప్రముఖ కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(Divya Spandana) (రమ్య) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు ? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్‌ బ్లాక్‌ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్‌ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదు. ఈ కేసును డీల్‌ చేస్తున్న పోలీసులను తప్పకుండా ప్రశంసించాల్సిందే. పోలీసులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేపడతారని ఆశిస్తున్నాను. ప్రజల్లో చట్టంపై నమ్మకాన్ని పెంపొందిస్తారని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

మరోవైపు హీరోయిన్‌ సంజన గల్రానీ… దర్శన్‌ను వెనకేసుకొచ్చింది. సెలబ్రిటీలపై ఏవైనా ఆరోపణలు వచ్చాయంటే చాలు వెంటనే తప్పు చేశారని నమ్మేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. అప్పుడే తుది నిర్ణయానికి వచ్చేయకండి అని పేర్కొంది. కాగా దర్శన్‌కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. ఇల్లాలిని పట్టించుకోకుండా నటి పవిత్రగౌడతో రిలేషన్‌షిప్‌ పెట్టుకున్నాడు. దాదాపు పదేళ్లుగా పవిత్రతో కలిసుంటున్నాడు. భార్యను వదిలేసి ప్రియురాలితో తిరగడం అతడి అభిమాని రేణుకాస్వామికి నచ్చలేదు. ఆ కోపంతోనే పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారా స్థాయికి చేరడంతో పవిత్ర… దర్శన్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో కోపోద్రిక్తుడైన దర్శన్… రేణుస్వామిని మందలించాల్సింది పోయి ఏకంగా ప్రాణాలే తీయడం శోచనీయం.

Also Read : Kannappa: గ్రాండ్ గా ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ ! సినిమాపై మోహన్ బాబు ఆశక్తికర వ్యాఖ్యలు !

Banglore PoliceDarshan ThoogudeepaDivya SpandanaPavitra Gowda
Comments (0)
Add Comment