Directors Day:‘‘‘దర్శకులకే కాకుండా… సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. డైరెక్టర్స్ డే వేడుకల్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
Directors Day: May 19th:
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకల్ని తెలుగు సినిమా దర్శకుల సంఘం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఇదే వేదికపై ఈ నెల 19న జరగనున్న డైరెక్టర్స్ డే ఉత్సవాలకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, దామోదర్ ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, సి.కల్యాణ్, అనిల్ కుమార్ వల్లభనేనితోపాటు, దర్శకులు శంకర్, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, వశిష్ఠ, విజయ్ కనకమేడల, రామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమకి, దర్శకుల సంఘానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్స్ డే వేడుకల్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజ సూర్యనారాయణ, అనుపమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read :-Shahid Kapoor: ప్రేమ విషయంలో ఇద్దరమ్మాయిలు చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరో !