Rana Daggubati : హీరో రానా పంచులకు భగ్గుమన్న ఆ డైరెక్టర్

ఎప్పుడుసోషల్ మీడియాలో మంచి ఫైర్‌తో యాక్టివ్‌గా ఉండే డైరెక్టర్ హరీష్ శంకర్....

Rana Daggubati : టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ రానా దగ్గుబాటి(Rana Daggubati) సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో మంచి విట్టినెస్, సెటైరికల్ పంచ్‌లతో రియాలిటీ షోస్‌లో అలరిస్తుంటాడు. ఇటీవల అబుదాబిలో నిర్వహించిన ఐఫా అవార్డుల వేడుకను యంగ్ సెన్సేషన్ తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్ చేశాడు. ఈ షో‌లో రానా వేసిన పంచ్‌లకి పలువురు హీరోల ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. ఈ హీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కి కూడా తాకడంతో ఆయన తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

Rana Daggubati Comments…

ఎప్పుడుసోషల్ మీడియాలో మంచి ఫైర్‌తో యాక్టివ్‌గా ఉండే డైరెక్టర్ హరీష్ శంకర్.. మిస్టర్ బచ్చన్ ప్లాప్ తర్వాత కాస్త స్లో అయ్యాడు. ఇది పక్కన పెడితే.. రానా(Rana Daggubati) ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌లో తేజ సజ్జతో మాట్లాడుతూ.. ఈ ఇయర్ అమితాబ్ బచ్చన్ కెరీర్‌లోనే అతి పెద్ద ఎత్తును, లోతును చూశారన్నారు. దీనికి ఎత్తు ఏంటని తేజ అడగగా, రానా కల్కి అని సమాధానం ఇచ్చాడు. మరి లోతు అని అడగగా, రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది కదా.. అదే “మిస్టర్..” అంటూ మిస్టర్ బచ్చన్ సినిమాని ట్రోల్ చేశాడు. దీంతో రవితేజ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఒక అభిమాని హరీష్ శంకర్‌ని ట్యాగ్ చేస్తూ.. మళ్ళీ మనం కాలర్ ఎగిరేసే సినిమా తీయాలని.. రానా మాట్లాడిన వీడియోని జత పరుస్తూ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ “ఎన్నో విన్నాను తమ్ముడు, అందులో ఇదొకటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, నాకైనా.. ఎవరికైనా” అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.

ఇకమరోవైపు కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రానాపై కక్షగట్టారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచినా మహేష్ గుంటూరు కారం సినిమాపై తేజ ‘హనుమాన్’ చిత్రం పైచేయి సాధించిన విషయాన్నీ సెటైరికల్ మాట్లాడటంతో బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ షోస్ నుండి నేషనల్ షోస్ వరకు సైటైరికల్ కామెడీని అనేది ఎప్పుడో భాగమై పోయింది. ఈ కల్చర్ లో తమపై తాము సెటైర్లు వేసుకుంటూ.. ఇతర సెలబ్రిటీలపై సెటైర్స్ వేస్తారు. కానీ.. ఆ జోక్స్ సీరియస్ కాదు కాబట్టి అందరు మంచి స్పోర్టివ్‌గానే తీసుకుంటారు.

Also Read : Game Changer : అసలు ఊహించని ప్లాన్ తో ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్న ‘గేమ్ ఛేంజర్’ టీమ్

CommentsHarish SankarRana DaggubatiViral
Comments (0)
Add Comment