Director Vetrimaran : ఆ కోలీవుడ్ అగ్ర హీరోతో సినిమాకు సిద్ధమవుతున్న డైరెక్టర్ వెట్రిమారన్

విడుదల2 సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది...

Vetrimaran : కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదల 2 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 2022లో వచ్చిన విడుదల చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో సూరి, విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్ మీనన్, చేతన్, రాజీవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా సూరి హీరోగా తెరంగేట్రం చేశారు. సినిమా మొదటి భాగం విడుదలైన వెంటనే రెండో పార్ట్‌కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. రెండేళ్ల తర్వాత డిసెంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

Director Vetrimaran Movie Updates

విడుదల2 సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran) నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడనే టాక్ మొదలైంది. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం వెట్రిమారన్ తదుపరి సినిమా హీరో సూర్యతో ఉండనుందట. కంగువ సినిమా డిజాస్టర్ తర్వాత సూర్య నటించబోయే సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కొన్నాళ్లుగా సూర్య నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రంలో నటిస్తున్నాడు. డిఫరెంట్ లుక్‌లో ఉన్న సూర్య తొలి వీడియోను చిత్ర బృందం చాలా నెలల క్రితం విడుదల చేసి అంచనాలను పెంచింది. ఆ తర్వాత దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య తన 45వ చిత్రాన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు వెట్రిమారన్, సూర్య కాంబోలో మరో సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో వీరిద్దరి షూటింగ్ స్టార్ట్ కానుంది.

Also Read : Vijay Sethupathi : బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసిన సేతుపతి సినిమా

MoviesSuriyaTrendingUpdatesVetrimaaranViral
Comments (0)
Add Comment