Trinadha Rao Sorry to Beauty : హీరోయిన్ పై నోరు పారేసుకున్న డైరెక్ట‌ర్

సోషల్ మీడియాలో త్రినాథ‌రావు వైర‌ల్

Trinadha Rao : ఈ మ‌ధ్య కొత్త ట్రెండ్ కొన‌సాగుతోంది. ఏదైనా సినిమా హిట్టు కావాలంటే ఏదో ర‌కంగా వివాదాస్ప‌దం చేయాల‌ని చూస్తూ ఉన్నారు. ఇందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా మారుతోంది. ప్ర‌త్యేకించి ఎంతగా పాపుల‌ర్ అయితే అంత‌గా మూవీ హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం.

Trinadha Rao Say Sorry to..

దీంతో ప్ర‌తి ఒక్క‌రు సినిమా తీయ‌డం కంటే దానిని మ‌రింత హైప్ చేసేందుకే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నారు నిర్మాత‌లు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు సైతం. తాజాగా ధ‌మాకా, నేను లోక‌ల్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు(Trinadha Rao) నోరు పారేసుకున్నారు.

ఒక‌ప్పుడు అక్కినేని నాగార్జున‌, సోనాలీ బింద్రే క‌లిసి న‌టించిన మ‌న్మ‌థుడు సినిమాలో మ‌రో కేరెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించిన అన్షు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను కొంచెం బ‌రువు పెర‌గాల‌ని సూచించాడు. అంతే కాదు తెలుగు ప్రేక్ష‌కులు సైజులు కోరుకుంటున్నారంటూ చెప్ప‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే సినిమాలు పోర్న్ సినిమాల‌ను త‌ల‌పింప చేసేలా ఉన్నాయ‌నే అప‌వాదు ఎదుర్కొంటోంది.

మొత్తంగా తాను చేసిన కామెంట్స్ పై స్పందించేందుకు నిరాక‌రించారు డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు.

Also Read : Anil Ravipudi Praise Victory : వెంక‌టేశ్ కెరీర్ లో బెస్ట్‌ ఎంటైర్టెనర్‌

CommentsDirectorSlamsViral
Comments (0)
Add Comment