Sukumar : ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను బన్నీతో తీసిన పుష్ప-2 మూవీ బిగ్ హిట్. భారీ కలెక్షన్స్ తో రికార్డ్ బ్రేక్ చేసింది. తాజాగా తన కూతురు సుకృతి వేణి నటిగా సినిమాలో నటించడంపై స్పందించారు సుకుమార్(Sukumar). కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తుందో చెప్పలేం అన్నాడు. తన కూతురు బాగా పాడుతుందని, కానీ ఇంత బాగా నటిస్తుందని తాను అనుకోలేదన్నాడు.
Director Sukumar Comment
పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన గాంధీ తాత చెట్టు సినిమాలో కీలకమైన రోల్ పోషించింది సుక్కు గారాల పట్టి సుకృతి వేణి. ఈ చిత్రాన్ని నవీన్ ఏర్నేని, యలమంచలి రవి శంకర్, శేష సింధురావు నిర్మించారు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాకు సంబంధించిన ముచ్చట్లు పంచుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇంట్లో తన కూతురు పాటలు బాగా పాడటం చూసి ఆనందపడ్డా. కానీ ఈ సినిమా చూశాక తన నటించిన తీరును చూసి ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నారు. ఇంతకు తన కూతురేనా అనే అనుమానం కూడా కలిగిందన్నారు. అంత మెచ్చుకోలుగా నటించిందని పేర్కొన్నారు.
వినోదం ముఖ్యం. క్రైమ్ నుంచి మనిషికి సేద దీరే సమయం కేవలం సినిమా ద్వారా మాత్రమే దక్కుతుందన్నారు. వినోదంతో పాటు సందేశం కూడా ఉంటే ఆ సినిమాకు పెద్ద అసెట్ అవుతుందన్నాడు. చెట్టుకి, మనిషికి మధ్య లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ సినిమా కథ అని పేర్కొన్నారు.
Also Read : Victory Venkatesh – SV Collections : నవ్వుల నజరానా వసూళ్ల ఖజానా