Sukumar : జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా పుష్ప ది రైజ్ మూవీ సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంపిక కావడంతో మెగా , అల్లు ఫ్యామిలీలో పెద్ద ఎత్తున ఆనందం వెల్లి విరుస్తోంది. ఈ సందర్బంగా బన్నీని డిఫరెంట్ గా చూపించడమే కాదు నేషనల్ స్టార్ ను చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంతోషానికి లోనయ్యారు.
Sukumar Feels Proud
తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఇక అతడితో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప ను తెరకెక్కించాడు. ఎంతో మంది హీరోలను అనుకున్నప్పటికీ ఎందుకనో సుకుమార్(Sukumar) బన్నీని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
డిఫరెంట్ డైలాగ్ లతో, మేనరిజంతో కట్టి పడేశాడు బన్నీ. విడుదలైన ప్రతి చోటా కాసులు కొల్లగొట్టింది. బాక్సులు బద్దలు కొట్టింది. దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. నిర్మాతలకు పంట పండేలా చేసింది ఈ ఒక్క సినిమా. దీంతో ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పుష్ప -2 పార్ట్ సీక్వెల్ గా తీస్తున్నాడు.
జాతీయ స్థాయిలో అవార్డు ప్రకటించిన వెంటనే అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ అదుర్స్