Rajamouli : ప్యాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) వెరీ స్పెషల్. తను దేవుడిని నమ్మడు. తన భార్య మాత్రం పూజలు చేస్తే వద్దని చెప్పడు. అది ఆమె వ్యక్తిగతానికి సంబంధించినది. తాను ఎక్కువగా చదువుకోలేదు. కానీ యావత్ ప్రపంచం మెచ్చుకునేలా, విస్తు పోయేలా అద్బుతమైన దర్శకుడిగా పేరు పొందాడు. క్రియేటివిటీకి పెట్టింది పేరు. భారత దేశంలో ఎక్కువగా టెక్నాలజీని వాడుకుని నేచురల్ గా సినిమాను తెరకెక్కించడంలో పేరు పొందాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
Rajamouli SSMB29 Movie Updates
తను తీసిన ప్రతి మూవీ ఓ సూపర్ డూపర్ హిట్. డార్లింగ్ ప్రభాస్ తో తీసిన ఛత్రపతి , సునీల్ తో తీసిన మర్యాద రామన్న, నానితో తీసిన ఈగ, రామ్ చరణ్ తో తీసిన మగధీర, మాస్ మహారాజాతో తీసిన విక్రమార్క..ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వెరీ వెరీ స్పెషల్. ఆ తర్వాత ప్రభాస్, అనుష్క, సత్యరాజ్ తో కలిపి తీసిన బాహుబలి దేశాన్ని ఊపు ఊపింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చెర్రీతో తీసిన ఆర్ఆర్ఆర్ (రణం, రౌద్రం, రుధిరం) సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా హాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారేలా చేసింది.
అంతే కాదు ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది. బెస్ట్ రైటర్..సాంగ్ గా ఎంపికైంది. దీనిని చంద్రబోస్ రాయగా ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. తాజాగా అందరి దృష్టిని ఆకట్టుకునేలా మరో సినిమాను ప్రారంభించాడు సైలెంట్ గా. అదే మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎక్కడా ప్రచారం నిర్వహంచడం లేదు. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇందులో మహేష్ బాబును భిన్నంగా చూపించ బోతున్నట్లు టాక్.
Also Read : Hero Hrithik Roshan :జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు