Shekhar Kapur : కేంద్రం ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఎంపిక చేసింది. దక్షిణాది రంగానికి సంబంధించి నలుగురిని వరించాయి. నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, అనంత్ నాగ్, శోభనలకు పద్మాలు దక్కాయి.
Shekhar Kapur – Padma Bhushan Award
ఇక దర్శకత్వ విభాగంలో మోస్ట్ పాపులర్ దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కపూర్(Shekhar Kapur) కు పద్మ భూషణ్ పురస్కారం లభించింది. పద్మ అవార్డుల పరంగా చూస్తే కేంద్రం మొత్తం 139 మందిని ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
శేఖర్ కపూర్ భారతీయ దర్శకులలో జనాదరణ పొందిన దర్శకుడిగా పేరొందారు. డిసెంబర్ 6, 1943లో పుట్టాడు. చిత్ర నిర్మాత, నటుడు కూడా. మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. సినిమా మీద ప్రేమతో ఎంటర్ అయ్యాడు. విజయవంతమైన సినిమాలు తీశాడు. బాండిట్ క్వీన్ సెన్సేషన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేషన్‌తో పాటు బాఫ్టా అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్ మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నారు.
శేఖర్ కపూర్ 1983లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మసూమ్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు, 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాతో విస్తృతమైన ప్రశంసలు పొందాడు. 1994లో ఫూలన్ దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా బాండిట్ క్వీన్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.
1998 లో తాను తీసిన ఎలిజబెత్ మూవీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. వార్ డ్రామా ఫిల్మ్ ది ఫోర్ ఫెదర్స్ (2002) అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. శేఖర్ కపూర్ రామ్ గోపాల్ వర్మ మణిరత్నంతో కలిసి భారతీయ చలనచిత్ర సంస్థను స్థాపించాడు.
Also Read : Beauty Keerthy-Antony : బ్యూటిఫుల్ కపుల్ వైరల్