Director Shankar: ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం !

ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం !

Director Shankar: పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌(Director Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వివాహం కన్నుల వేడుకగా జరిగింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌ తో సోమవారం ఉదయం ఆమె ఏడడుగులు వేశారు. చెన్నైలో ప్రముఖ ఫంక్షన్‌హాల్‌ లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు, సినీ ప్రముఖులు సందడి చేశారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు, సూర్య, కార్తి, నరేశ్‌ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Director Shankar – మొదటి భర్తతో విడాకులు ! రెండో పెళ్లి చేసుకున్న ఐశ్వర్య !

క్రికెటర్‌ రోహిత్ దామోదరన్‌ ను 2021లో డాక్టర్ ఐశ్వర్య శంకర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రోహిత్ దామోదరన్ పోక్సో కేసులో ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్‌ లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని చాలా ఫిర్యాదులు రావడంతో ఆయనపై కేసు నమోదైంది. దీనితో ఐశ్వర్య శంకర్… అతని నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఐశ్వర్య తన తండ్రి శంకర్‌ తోనే ఉంటోంది. ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తున్న ఐశ్వర్యకు… అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌ తో కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు… పాటల రచయిత, నేపథ్య గాయకుడు కూడా. తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌(Director Shankar) సినిమాలకూ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు.

శంకర్‌ ప్రస్తుతం రెండు పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ జూన్‌లో విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read : Tamannaah Bhatia: ‘పంచుకో’ అంటూ అందాలు ఆరబోస్తున్న మిల్క్ బ్యూటీలు !

game changerindian 2Shankar
Comments (0)
Add Comment