Sandeep Reddy Vanga : మరోసారి ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ పై వ్యాఖ్యానించిన డైరెక్టర్

ఇదే ఎక్స్‌పోలో పాల్గొన్న సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌తో తీయబోతున్న 'స్పిరిట్‌’ చిత్రం గురించి మాట్లాడారు...

Sandeep Reddy Vanga : దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ఏపీలోని పలు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే! విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు వర్మకు నోటీసులు పంపారు. తాజాగా సినిమాటిక్‌ ఎక్స్‌పో 2024 కార్యక్రమానికి హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. పోలీసులు ఇచ్చిన నోటీసులుపై విలేకరులు ప్రశ్నించగా, సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

Sandeep Reddy Vanga Comment

ఇదే ఎక్స్‌పోలో పాల్గొన్న సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌తో తీయబోతున్న ‘స్పిరిట్‌’ చిత్రం గురించి మాట్లాడారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ తన సినిమాల్లో సీజీ షాట్స్‌ పెద్దగా వాడలేదని, ‘యానిమల్‌’ కోసం కొద్దిగా మాత్రమే వాడినట్లు తెలిపారు. భవిష్యత్‌లో తన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌ను భాగం చేేసలా ప్రయత్నిస్తానని అన్నారు.సంక్రాంతికి ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇస్తారా?, కొరియన్‌ నటుడు డాన్‌లీ మీ మూవీలో ఉన్నారా? అని వరుసగా ప్రశ్నలు ఎదురు కాగా, అన్నింటికీ సమాధానం త్వరలోనే చెబుతానని, అభిమానులకు ఊపిరాడకుండా అప్‌డేట్స్‌ ఇస్తాని అన్నారు.

Also Read : Teja Sajja : స్క్రిప్ట్ లో రాసిందే చదివాం తప్ప..మాకు వేరే చెడు ఆలోచనలు లేవు

CinemaSandeep Reddy VangaSpiritTrendingUpdatesViral
Comments (0)
Add Comment