Director RJ Balaji: ‘యానిమల్’ సినిమాపై కోలీవుడ్ నటుడు, దర్శకుడు సంచలన వ్యాఖ్యలు !

'యానిమల్' సినిమాపై కోలీవుడ్ నటుడు, దర్శకుడు సంచలన వ్యాఖ్యలు !

Director RJ Balaji: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీడియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’. దీపావళి కానుకగా గత ఏడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా… రణ్ బీర్ కపూర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.900 కోట్లు వసూలు చేసింది. అయితే అదే సమయంలో ఈ సినిమాలో ఉన్న హింస, మహిళలను చులకనగా విలన్ చూసే తీరుపై విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ(Director RJ Balaji)… ‘యానిమల్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా చూడటం తనకు అస్సలు ఇష్టం లేదంటూ ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Director RJ Balaji -n సినిమాలో అమ్మాయిని చులకనగా చూడటం నచ్చలేదు- నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ

‘యానిమల్’ సినిమా గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… ‘థియేటర్‌లో నేను యానిమల్‌ సినిమా చూడలేదు, చూడాలనుకోలేదు కూడా ! చాలామంది ఈ సినిమా చూడమని, అద్భుతంగా ఉందని సలహా ఇచ్చారు. నాకు నచ్చని అంశం ఏంటంటే… ఒకమ్మాయిని కొడుతుంటే, తనను వేధిస్తుంటే థియేటర్‌లో జనాలు ఎంజాయ్‌ చేస్తున్నారు. దాన్ని నేను సహించలేను. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ జనాలు ఎంజాయ్‌ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అలాంటి సన్నివేశాలను చూసి ఆనందించడం సరైన విధానం కాదు. ఇవి జనాలను ఏదో ఒకరకంగా ప్రేరేపిస్తాయి. అలాంటి సన్నివేశాలు నా సినిమాలో అయితే పెట్టనివ్వను. యానిమల్‌ లో హీరో… హీరోయిన్ తృప్తి డిమ్రిని తన షూ నాకమన్నాడట. యూత్‌ ఇలాంటివి చూసినప్పుడు ఆడవాళ్లతో అలాంటి పనులు చేయించడం తప్పేం కాదని ఫీలవుతారు’ అంటూ సినిమాలోని తనకు అభ్యంతరకరమైన విషయాలు ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Jamie Lever: టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ జేమీ లీవర్‌ !

animalRJ Balaji
Comments (0)
Add Comment