Puri Jagannadh : డైరెక్టర్ పూరి తర్వాత సినిమా సందీప్ కిషన్ తోనా..?

ఈ నేపథ్యంలోనే హీరో అన్వేషణలో పడ్డ పూరికి ఏ హీరో ఓకే చెప్పట్లేదట...

Puri Jagannadh : టాలీవుడ్‌ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ . ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాప్స్‌తో సతమతవుతున్నాడు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పూరికి ఇప్పుడేమైందని చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు రాజమౌళి తండ్రి, రచయిత విజేంద్రప్రసాద్.. పూరి‌(Puri Jagannadh)లా పనిచేయాలి, రాయాలి అని ఎంతో తాపత్రయ పడేవాడు. ఇప్పుడు ఆయన రాతల్లో లోపమో లేదా నయా జెనరేషన్‌కి ఆయన సినిమాలు ఎక్కట్లేదేమో తెలీదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు. కానీ.. ఇప్పుడు ఆయనకు హీరోలే దొరకట్లేదట.. ప్రస్తుతం ఆయన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోని తన నెక్స్ట్ సినిమా కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Puri Jagannadh Movie Updates

విజయ్దేవరకొండ ‘లైగర్’ ఉస్తాద్ రామ్ పోతినేని ‘ డబుల్ ఇస్మార్ట్’ సినిమాలతో చతికిలపడ్డ పడ్డ పూరి ఈ సారి గట్టిగ బౌన్స్ బ్యాక్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే హీరో అన్వేషణలో పడ్డ పూరికి ఏ హీరో ఓకే చెప్పట్లేదట. అయితే పూరి బెస్ట్ ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు మేన అల్లుడు, టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ ఒక కథకి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాకపోయినా దాదాపు ఫిక్సే అంటున్నాయి ఫిలింనగర్ సర్కిల్స్. వాస్తవానికి లైగర్ సినిమా తర్వాత పూరి విజయ్‌తోనే ‘జనగణమన’ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. లైగర్ డిజాస్టర్ తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ మొదట్లో మహేష్ బాబుతో తీయాలని ప్లాన్ చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ఈ డైరెక్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తీసి మరింతా బొక్కాబోర్లాపడ్డాడు.

Also Read : Ka Movie : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Moviespuri jagannadhSandeep KishanUpdatesViral
Comments (0)
Add Comment