Prasanth Varma : తాను చదువుకున్న బడి పంతుళ్ళతో ముచ్చటించిన ‘హనుమాన్’ డైరెక్టర్

మధ్యలో థట్ ఈస్ మహాలక్ష్మి అనే సినిమా చేశాడు...

Prasanth Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు.. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. 2018లో అ! సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ప్రశాంత్ వర్మ. అ! అనే సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఆతర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత తేజ సజ్జ హీరోగా జాంబీ రెడ్డి అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జాంబీ రెడ్డి సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) పేరు హాట్ టాపిక్ గా మారింది.

Prasanth Varma Meet

మధ్యలో థట్ ఈస్ మహాలక్ష్మి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఇక రీసెంట్‌గా మరోసారి తేజ సజ్జతో కలిసి హ‌ను మాన్ సినిమా చేశారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఏకంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 500కోట్లు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తనకు చదువు చెప్పిన టీచర్లను కలిశాడు ప్రశాంత్ వర్మ. తాను చదివిన స్కూల్ లో రీ యూనియన్ కి హాజరవ్వగా ఆ ఫోటోలని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. ప్రశాంత్ వర్మ పాలకొల్లులో శ్రీ సరస్వతి శిశుమందిర్ చదువుకున్నాడు. తను చదివిన స్కూల్ గురించి.. తనకు చదువు చెప్పిన టీచర్ల గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. తన స్కూల్ ఫోటోలను షేర్ చేస్తూ.. 20 ఏళ్ళ తర్వాత శ్రీ సరస్వతి శిశుమందిర్ లో మళ్ళీ కలుసుకున్నాం. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా చుట్టూ నా టీచర్లు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లంతా నా జర్నీలో తోడున్నారు అంటూ రాసుకొచ్చాడు ప్రశాంత్ నీల్.

Also Read : Kamal Haasan : కమల్ హాసన్ కెమెరా ముందుకు వచ్చి 65 ఏళ్ళు అయిందా..!

DirectorhanumanPrasanth VarmaUpdatesViral
Comments (0)
Add Comment