Prasanth Varma Magic : హనుమాన్ సినిమాపై డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘హను–మాన్‌’ పైమీరు చూపించిన అశేష ప్రేమాభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్నా...

Prasanth Varma : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను–మాన్‌’. గత ఏడాది సంక్రాంతి బరి పెద్ద సినిమాలతో పోటీ పడి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారానికి ఈ చిత్రం విడుదలై ఏడాదైన సందర్భంగా ప్రశాంత్‌ వర్మ(Prasanth Varma) ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా తనకు విజయాన్ని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా ఇచ్చిందని అన్నారు. హనుమంతుని గదను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నట్లు పేర్కొన్నారు.

Prasanth Varma Hanuman Magic

‘‘హను–మాన్‌’ పైమీరు చూపించిన అశేష ప్రేమాభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్నా. మన ఇతిహాస కథకు సూపర్‌హీరో హంగులు జోడించి మా విజన్‌ను మీ ముందుకు తీసుకువచ్చి నేటితో ఏడాది అవుతోంది. ఆ చిత్రానికి మీరు అందించిన సపోర్ట్‌ నాకెంతో విలువైనది. ఈ మేజిక్‌ను క్రియేట్‌ చేయడంలో భాగమైన నటీనటులకు, నిర్మాతలకు నా ధన్యవాదాలు. విజయాన్ని మించి అభిరుచి ఆశీస్సులు ఉంటే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక గట్టి నమ్మకాన్ని ఈ సినిమా నాకు అందించింది. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, నాకు ఎంతగానో మద్దతు ఇస్తున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌లో పేర్కొన్నారు.

తాజాగా ఆయన ‘హను–మాన్‌’కు కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ తెరకెక్కించబోతున్నారు. కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ఇందులో హనుమాన్‌ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌ ఫస్ట్‌లుక్‌ను ఆయన ఇప్పటికే పంచుకున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్‌లో కీలకాంశం. ‘హనుమాన్‌’లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు.

Also Read : Hero Vikram Movie : చియాన్ విక్రమ్ 63వ సినిమా కు హీరోయిన్ల మధ్య పోటీ

hanumanPrasanth VarmaTrendingUpdatesViral
Comments (0)
Add Comment