Pa Ranjith : ఉద‌యనిధి కామెంట్స్ ‘పా’ స‌పోర్ట్

డైరెక్ట‌ర్ పా రంజిత్ వ్యాఖ్య‌

Pa Ranjith : చెన్నై – త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్న త‌రుణంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా రంజిత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అన్న‌దాంట్లో త‌ప్పేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Pa Ranjith Comments Viral

గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు పా రంజిత్(Pa Ranjith) స్పందించాడు. స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని పిలుపునిచ్చే ప్ర‌క‌ట‌న శ‌తాబ్ధాలుగా కుల వ్య‌తిరేక ఉద్య‌మానికి ప్ర‌ధాన సూత్రమ‌ని పేర్కొన్నారు . కులం, లింగం పేరుతో అమానుష‌మైన ఆచారాల మూలాలు స‌నాత‌న ధ‌ర్మంలో ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు పా రంజిత్.

విప్ల‌వ నాయ‌కుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ , ఇయోథీదాస్ పండితార్ , తంతై పెరియార్ , మ‌హాత్మా జ్యోతిబా పూలే, సంత్ ర‌విదాస్ వంటి కుల వ్య‌తిరేక సంస్క‌ర్త‌లు త‌మ కుల వ్య‌తిరేక భావ‌జాలాన్ని స‌మ‌ర్థిస్తూ వ‌చ్చార‌ని స్ప‌ష్టం చేశారు పా రంజిత్.

మంత్రి ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి మార‌ణ హోమానికి పిలుపునిచ్చే దుర్మార్గ‌మైన వైఖ‌రి ఆమోద యోగ్యం కాద‌ని పేర్కొన్నారు. మంత్రిపై పెరుగుతున్న ద్వేషం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పా రంజిత్.

సామాజిక న్యాయం, స‌మాన‌త్వంతో కూడిన స‌మాజాన్ని స్థాపించేందుకు స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని పిలుపునిచ్చిన ఉద‌య‌నిధి స్టాలిన్ కు తాను సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు.

Also Read : Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిష్ట‌ర్ పొలిశెట్టి కెవ్వు కేక

Comments (0)
Add Comment