Salaar 2 : డిసెంబర్ 22, 2023.. సరిగ్గా ఏడాది కింద ఇదేరోజు సలార్ విడుదలైంది. రాధే శ్యామ్, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్‌తో నీరుగారిపోయి ఉన్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్టు కొట్టు రెబల్ అంటూ ఎదురుచూస్తున్న రోజులవి. ఆ టైమ్‌లో ఓ మాస్ సినిమాతో వచ్చారు ప్రశాంత్ నీల్. అదే సలార్.. తొలిరోజు నుంచే ఈ సినిమాకు టాక్ అదిరిపోయింది.కేజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా విడుదలైంది సలార్. ఎలివేషన్స్‌తో పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. అయితే ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్‌బస్టర్ అయితే కాలేదు సలార్.. ఓ మాంచి హిట్టైతే వచ్చింది.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే చెప్పారు.
Salaar 2 Movie Updates
కేజియఫ్ పై ఫోకస్ చేయడంతో.. సలార్ అంత బాగా రాలేదని చెప్పుకొచ్చారు.సలార్ 1 ఇయర్ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. సీక్వెల్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో సలార్ 2 బెస్ట్ స్క్రిప్ట్ అన్నారీయన. దాంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ 2 శౌర్యంగ పర్వం షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలిపారు నీల్. మరి చూడాలిక.. ఆ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో.
Also Read : Marco Movie : బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఓ మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో