Nag Ashwin : అంచ‌నాల‌కు మించి ‘క‌ల్కి’ – నాగ్

ఉంటుంద‌న్న ద‌ర్శ‌కుడు

Nag Ashwin : మ‌హాన‌టి సినిమాతో దేశ‌మంతా ఎవ‌రీ ద‌ర్శ‌కుడు అని త‌న వైపు తిప్పుకునేలా చేసిన నాగ్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం త‌న ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ తో పాన్ ఇండియా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంతో క‌ల్కి 2898ఏడీ పేరుతో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

హైద‌రాబాద్ లో భారీ ఖ‌ర్చుతో సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీ ద‌త్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బ‌డ్జెట్ దాదాపు రూ. 1,000 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Nag Ashwin Kalki Updates

ఈ సంద‌ర్బంగా క‌ల్కి మూవీకి సంబంధించి ఫ‌స్ట్ ఛాయిస్ హీరోగా ఎవ‌రిని అనుకున్నార‌నే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్రాజెక్టు త‌యారు చేసిన వెంట‌నే త‌న‌కు ఏ హీరో ముందుగా గుర్తుకు రాలేద‌న్నాడు నాగ్ అశ్విన్(Nag Ashwin). ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

కేవ‌లం పాన్ ఇండియాలో త‌న‌కు ఒకే ఒక్క‌డు డార్లింగ్ ప్ర‌భాస్ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చాడ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు. ఇందులో ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ , క‌మ‌ల్ హాస‌న్ , దీపికా ప‌దుకొనే , దిశా ప‌టానీని ఎంపిక చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

జాతి ర‌త్నాలు సినిమా చేస్తున్న స‌మ‌యంలోనే క‌ల్కి ప్రాజెక్టు మొద‌లు పెట్టాన‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.

Also Read : Salaar Movie : రెబ‌ల్ స్టార్ డ‌బుల్ రోల్

Comments (0)
Add Comment