Nag Ashwin : కల్కి 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు...

Nag Ashwin : ‘కల్కి 2898AD’ పార్ట్ 2కు ఇంకా చాలా సమయం ఉందని అన్నారు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ఆయన ప్రిన్స్ శివకార్తికేయన్ నటించిన మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్‌(Nag Ashwin)కు ‘కల్కి 2’పై ప్రశ్నలు ఎదురయ్యాయి. షూటింగ్ ఎప్పుడు? విడుదల ఎప్పుడు? ఈ గ్యాప్‌లో వేరే ఏమైనా సినిమాలు చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ఎదురుకాగా, వాటన్నింటికీ ఆయన సమాధానం ఇచ్చారు.

Nag Ashwin Comment

ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్(Nag Ashwin) మాట్లాడుతూ.. ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వారి సపోర్ట్ వల్లే ‘కల్కి’ ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ‘ అమరన్’ విషయానికొస్తే.. రెండు వారాలు ముందు సాయి పల్లవి ఇంట్రో వీడియో చూశాను. అప్పుడే ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. ఇది చాలా వండర్‌ఫుల్ స్టోరీ. డైరెక్టర్ క్లియర్ విజన్‌తో ఉన్నారు. ఇలాంటి స్టోరీ చేయాలంటే చాలా ఫ్యాషన్ కావాలి. ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి రియల్ స్టోరీ చెప్పడం చాలా అవసరం. అలాంటి కథలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కమల్ హాసన్ సార్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కల్కి పార్ట్ 2 గురించి చెబుతూ.. ‘కల్కి 2’కి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం. ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే.. ఈ ఒక్క సినిమా రెండు ప్రాజెక్ట్స్‌తో సమానం అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కాగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ‘అమరన్’ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ మూవీ విడుదలకాబోతోంది.

Also Read : Thalapathy Vijay : దళపతి విజయ్ టీవీకే పార్టీ మొదటిసారి దద్దరిల్లే స్పీచ్

KalkiNag AshwinSequelTrendingUpdatesViral
Comments (0)
Add Comment