Lokesh Kanagaraj : చెన్నై – అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. రిలీజ్ కంటే ముందే రికార్డుల మోత మోగించింది. ఎక్కడ చూసినా జవాన్ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఏడాది షారుక్ ఖాన్ కు కాసుల పంట పండనుంది. ఇప్పటికే తాను నటించిన పఠాన్ కోట్లు కొల్లగొట్టింది. రూ. 1,000 కోట్ల మార్కును దాటేసింది.
Lokesh Kanagaraj Congratulates Jawan Team
తాజాగా జవాన్ సైతం బిగ్ టాక్ దూసుకు వెళుతోంది. ప్రత్యేకించి దర్శకుడు అట్లీ ప్రతిభ, బాద్ షా నటన, నయనతార అందం, దీపికా పదుకొనే స్పెషల్ అప్పియరెన్స్ , ప్రతి నాయకుడు విజయ్ సేతుపతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
మొత్తంగా మరోసారి బాద్ షా షారుక్ ఖాన్ ద్విపాత్రిభినయంతో కిర్రాక్ తెప్పించేలా చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాకు సంబంధించి మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ కిర్రాక్ అయ్యేలా తెప్పించాడని కితాబు ఇస్తున్నారు.
జవాన్ విడుదలై సక్సెస్ టాక్ అందుకోవడంతో అట్లీ కుమార్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు, లైక్ లతో హోరెత్తుతోంది. ఇందులో భాగంగా ఇవాళ తమిళ సినీ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) స్పందించారు. దర్శకుడు అట్లీకి, నటుడు షారుక్ కాన్ , నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతితో పాటు ఇతర టెక్నిషియన్స్ ను అభినందించారు.
Also Read : Pa Ranjith : ఉదయనిధి కామెంట్స్ ‘పా’ సపోర్ట్