Beauty Kayadu Lohar :లోహ‌ర్ టాప్ హీరోయిన్ అవుతుంది

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కామెంట్

Kayadu Lohar  : ఎవ‌రీ కాయాదు లోహ‌ర్ అనుకుంటున్నారా. తాజాగా విడుద‌లైన త‌మిళ సినిమా డ్రాగ‌న్ దుమ్ము రేపుతోంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కేవ‌లం వారం రోజుల్లోనే రూ. 51 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ రంగాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించారు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ , కాయాదు లోహ‌ర్(Kayadu Lohar). ఈ ఒక్క సినిమా ఇద్ద‌రికీ పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. ఎక్కువ‌గా ఎవ‌రీ కాయాదు లోహ‌ర్ అంటూ పెద్ద ఎత్తున శోధిస్తున్నారు. గూగుల్ లో టాప్ లో కొన‌సాగుతోంది.

Director Harish Shankar Praises Kayadu Lohar

డ్రాగ‌న్ స‌క్సెస్ మీట్ సంద‌ర్బంగా హాజ‌రైన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ అద్భుత‌మైన న‌టుడ‌ని, త‌న‌తో ఏదో ఒక రోజు సినిమా తీస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఇదే స‌మ‌యంలో త‌న న‌ట‌న‌తో, అందాల‌తో ఆక‌ట్టుకుంది న‌టి కాయాదు లోహ‌ర్ . ఆమె ఏదో ఒక రోజు ఇండియాలోనే టాప్ హీరోయిన్ అవుతుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. త‌న‌లో అద్భుత‌మైన టాలెంట్ దాగి ఉంద‌న్నాడు ద‌ర్శ‌కుడు.

కాగా కాయాదు లోహ‌ర్ స్వ‌స్థం అస్సాం లోని తేజ్ పూర్. ఏప్రిల్ 11, 2000లో పుట్టింది. తొలుత మోడ‌ల్ గా ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత తెలుగులో అల్లూరి అనే సినిమాలో న‌టించింది. కానీ ఆ సినిమా ఏమంత ఆడ‌లేదు. 2021లో వచ్చిన క‌న్న‌డ చిత్రం మొగిలిపేట్ లో అరంగేట్రం చేసింది. మ‌ల‌యాళంలో న‌టించిన పాథోన‌ప‌థం సూట్టండు చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. దీనిని తెలుగులో పులి – ది నైంటీంత్ సెంచ‌రీ పేరుతో రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఐ ప్రేమ్ యు, తారం, అజ‌యంతే రండం మోష‌ణం చిత్రాల‌లో న‌టిస్తోంది.

Also Read : Hero Priyadarshi- Court ప్రియ‌ద‌ర్శి ‘కోర్టు’ టీజ‌ర్ రిలీజ్

CommentsHarish SankarKayadu LoharPraisesTrending
Comments (0)
Add Comment