Hero Balakrishna-Harish Shankar :బాల‌య్య‌తో హ‌రీశ్ శంక‌ర్ మూవీ..?

ఓకే చెప్పిన‌ట్లు టాలీవుడ్ లో ప్ర‌చారం

Balakrishna : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుల్లో హ‌రీశ్ శంక‌ర్ ఒక‌డు. చెప్పాల‌ని అనుకున్న‌ది సూటిగా సుత్తి లేకుండా చెప్ప‌డంలో త‌న‌కు త‌నే సాటి. రాయ‌డంలో సిద్ద‌హ‌స్తుడు. చ‌ద‌వ‌డంలో నేర్ప‌రి. వెర‌సి సినిమా అంటే పిచ్చి. ఈ మ‌ధ్య‌నే ర‌వితేజ‌, భాగ్య‌శ్రీ బోర్సేతో క‌లిసి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తీశాడు. అది ఆశించిన మేర ఆడ‌లేదు. అయినా మ‌నోడి స్టార్ డ‌మ్ కు ఢోకా లేదు. ఎందుకంటే త‌న‌లో ద‌మ్ముంది. ఒకానొక ద‌శ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఊపు తీసుకు వ‌చ్చేలా చేశాడు. త‌ను రాసే డైలాగ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

Balakrishna-Harish Shankar

అవి బుల్లెట్స్, వెపన్స్ కంటే బలంగా ఉంటాయి. బ‌న్నీ, పూజా హెగ్డేతో తీసిన దువ్వాడ జ‌గ‌న్నాథం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ స‌మంత‌తో కూడా మూవీ తీశాడు. ఇప్పుడు హ‌రీశ్ శంక‌ర్(Harish Shankar) గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే నంద‌మూరి బాల‌కృష్ణతో(Balakrishna) త‌ను మూవీ తీయ‌బోతున్నాడ‌ని, ఇందుకు సంబంధించి త‌ను ఓకే కూడా చెప్పిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అటు బాల‌య్య కానీ ఇటు హ‌రీశ్ శంక‌ర్ కానీ క్లారిటీ ఇప్ప‌టి దాకా ఇవ్వ‌లేదు. ఇక హ‌రీశ్ శంక‌ర్ మ‌న‌స్త‌త్వం ఎలాంటిదంటే త‌న‌కు న‌చ్చితే వెంట‌నే క‌థ రాసుకుంటాడు.

ఆ క‌థ‌కు సంబంధించి ఎవ‌రైనా స‌రిపోతార‌ని అనుకుంటే చెప్పేందుకు ట్రై చేస్తాడు. ఓకే అంటే రెడీ అయి పోతాడు. లేదంటే త‌న ప్ర‌య‌త్నం మాత్రం మానుకోడు. ఇది ఆయ‌న స్టైల్. హీరోల ప‌రంగా ఎలా వాడుకోవాలో తెలిసినోడు మ‌నోడు. క‌సి ఉన్నా ఎక్క‌డా బ‌య‌ట‌కు క‌నిపించ‌నీయ‌కుండా చూస్తాడు. ప‌వ‌న్ ను ఓ రేంజ్ లో చూపించాడు. ఇప్పుడు గ‌నుక బాల‌య్య బాబు రియ‌ల్ గా ఓకే అంటే గ‌నుక త‌న ఫ్యాన్స్ కు ఇక పూన‌కాలు తెప్పించ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా హ‌రీశ్ శంక‌ర్ ద‌మ్మున్న డైరెక్ట‌ర్. మ‌రి ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో వేచి చూడాలి.

Also Read : Hero Prabhas-Betting Apps : బాల‌య్య‌..ప్ర‌భాస్..గోపిచంద్ పై కంప్లైంట్

Balakrishna NandamuriCinemaHarish SankarUpdatesViral
Comments (0)
Add Comment