Harish Shankar Sensational :కుటుంబం కోసం త్యాగం చేశాం

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌క‌ట‌న

Harish Shankar : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌మ్మున్న డైరెక్ట‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌రు. ప‌వ‌ర్ ఫుల్ టేకింగ్, మేకింగే కాదు అద్భుత‌మైన క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. అంత‌కు మించిన డైలాగులు ఆయ‌న స్వంతం. ఇంత‌లా పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు హ‌రీశ్ శంక‌ర్(Harish Shankar). త‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. భారీ ఎత్తున వ‌సూళ్లు చేసింది. అంతే కాదు త‌న‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. దీనిని సీక్వెల్ గా తీసే ప‌నిలో ప‌డ్డాడు. ఇటీవ‌లే త‌ను ముంబై నుంచి భాగ్య‌శ్రీ బోర్సేను తీసుకు వ‌చ్చాడు.

Harish Shankar Comments

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. డైలాగులు మాత్రం సూప‌ర్ గా ఉన్నాయంటూ ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న జాన‌ర్ ఏమిట‌నేది బాగా తెలిసిన వ్య‌క్తి హ‌రీశ్ శంక‌ర్(Harish Shankar). ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జ‌గ‌న్నాథం తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

హీరోల‌ను పోలీస్ ఆఫీస‌ర్స్ గా చూపించ‌డంలో త‌న‌కు తానే సాటి . ఇక తెలుగు సాహిత్యంపై మంచి ప‌ట్టు క‌లిగి ఉన్నారు హ‌రీశ్ శంక‌ర్. చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న జీవితం గురించి, ఇబ్బందులు, ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను పంచుకున్నారు. త‌న భార్య చేసిన సాయం గురించి మ‌రిచి పోలేనంటూ చెప్పాడు. ఎందుకంటే త‌మ‌ది పూర్తిగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవిత‌మ‌ని, నిత్యం ఇబ్బందులు ఉండేవ‌న్నాడు. ఈ సంద‌ర్బంగా ఒక‌వేళ పిల్ల‌లు ఉంటే స్వార్థం పెరుగుతుంద‌ని, కుటుంబం కోసం తాను, త‌న భార్య చిల్డ్ర‌న్స్ వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ద‌ర్శ‌కుడు. విచిత్రం ఏమిటంటే త‌న భార్య ఓ పేరు పొందిన డాక్ట‌ర్. త‌ను చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read : Hero Balakrishna :ప‌ద్మ భూష‌ణ్ పై బాల‌య్య షాకింగ్ కామెంట్స్

CommentsDirectorHarish SankarViral
Comments (0)
Add Comment