Director Harish Shankar : త్వరలో ముల్టీస్టారర్ వస్తానంటున్న హరీష్ శంకర్

మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడగ్గా, పవన్‌ కల్యాణ్‌, రవితేజతో చేస్తానని అన్నారు...

Director Harish Shankar : ఆహా ఓటీటీ వేదికగా నిర్వహిస్తున్న మ్యూజికల్‌ షో తెలుగు ఇండియన్ ఐడల్‌ సీజన్ – 3 కార్యక్రమంలో హరీశ్ శంకర్‌ సందడి చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. ఓ కార్యక్రమంలో హరీశ్ శంకర్‌(Director Harish Shankar) ఆసక్తికర విషయాలు చెప్పారు. పవన్ కల్యాణ్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగతసింగ్‌’ చిత్రం గబ్బర్‌సింగ్‌ చిత్రానికి డబుల్‌ ఉంటుందని చెప్పారు. ‘ మిరపకాయ్‌’ చిత్రం విషయంలో దర్శకుడిగా ఫెయిల్‌ అయి ఉండవచ్చు. కానీ, తన సినిమాల విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని హరీశ్‌ శంకర్‌ చెప్పుకొచ్చారు.

Director Harish Shankar Comment

మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడగ్గా, పవన్‌ కల్యాణ్‌, రవితేజతో చేస్తానని అన్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్‌ ప్రేక్షకులని విజిల్స్‌ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగానూ ట్రెండ్‌ అవుతుండటంతో ఓ ట్వీట్‌కు కూడా హరీశ్‌ రిప్లై ఇచ్చారు. ‘ చాలా మంది చాలా సార్లు అడిగారు. అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం’ అన్నారు. అలాగే, మహేశ్‌బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉంది. అది నా చిరకాల కోరిక అని హరీష్ అన్నారు.

Also Read : Niharika Konidela : ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంవత్సరం

CommentHarish SankarTrendingUpdatesViral
Comments (0)
Add Comment